నాకున్నవి రెండు అర్హతలు. ఒక ఆవేదన.
అందుకని ఈ వ్యాసాలు వ్రాశాను. ఇప్పుడు పుస్తకంగా తీసుకువస్తున్నాను.
ఆ రెండు అర్హతల్లో మొదటిది మూడు డిగ్రీల సంపాదన. రెండోది కేరళ, ఇండియాలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లోనూ, అమెరికాలో వివిధ హైటెక్ కంపెనీల్లోనూ కలిపి పని చేసిన యాబై ఏళ్ళ నా ఉద్యోగ పర్వం. సెమీకండక్టర్ కంపెనీల్లో వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్ పదవుల్లోనించీ ఆమధ్యనే విశ్రాంతి తీసుకుని, అలాటి కంపెనీల్లోనే కొంత కన్సల్టింగ్ కూడా చేశాను.
ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంటులో ఉద్యోగం చేస్తూ, మన దేశం నించీ వచ్చి ఉద్యోగాల్లో వున్న కొందరిని చూశాక, నాకొక ఆవేదన కూడా కలిగింది.
ఇండియానించీ విదేశాలకి వెళ్ళినవారేకాక ఇండియాలోనే...